20 ఏళ్ళ క్రితం ఒకే పాఠశాలలో చదివి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మిత్రులందరికీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగటం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2003,2004 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు సింగటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సత్కరించి సన్మానించారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 20,ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదువుకొని జీవిత పయనంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా మరికొంతమంది వివిధ రంగాల్లో తోపాటు వ్యాపారంలో స్థిరపడ్డారు. వ్యాపారంలో స్థిర పడ్డమని చిన్నప్పుడు తాము చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు సంతోషాన్ని పంచుకున్నారు ఎంత ఎత్తుకు ఎదిగిన చదువు చెప్పిన గురువులను తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సమాజంలో ఉపాధ్యాయులకున్న గౌరవం ఎనలేనిదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ రెడ్డి భాస్కర్ రావు అంజయ్య గోపాల్ భూమయ్య , విద్యార్థులు గున్నాల కిష్టారెడ్డి తాటికొండ ప్రవీణ్ రెడ్డి క్యాదరి శ్రీకాంత్ దామరమైన సంతోష్ కుమార్ రవీందర్ రెడ్డి ఆర్గనైజర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు