Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024, ఈనెల 19, 20 కోదాడ పట్టణంలో సిసిఆర్ పాఠశాల యందు నిర్వహించబడటానికి కావలసిన ఏర్పాట్లను, సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా బుధవారం నాడు సూర్యాపేట జిల్లా సైన్స్ అధికారి ( డి ఎస్ ఓ) L. దేవరాజు గారు, కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ గారు తెలియజేసినారు. బుధవారం18/12/24 మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోదాడ హుజూర్నగర్ డివిజన్లకు సంబంధించిన ప్రదర్శనల రిజిస్టర్ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయ ఉన్నట్లు తెలిపారు.19/12/24 గురువారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మిగిలిన డివిజన్ల వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. 19వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ప్రారంభం జరుగును. అదే రోజు మధ్యాహ్నం 1గంట నుండి కోకరికుల మ్ కార్యక్రమాల పోటీలు వ్యాసరచన, డిబేటింగ్ ,క్విజ్ నిర్వహించబడు నని తెలిపినారు. వివిధ కమిటీలకు సంబంధించిన కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు ప్రదర్శనలకు సంబంధించిన విద్యార్థులతో గైడ్ టీచర్స్ సకాలంలో కోదాడ యందు సి సి రెడ్డి పాఠశాలకు చేరుకోవాల్సిందిగా తెలియజేసినారు…

Related posts

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరిక… 

TNR NEWS

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs