వరంగల్ జిల్లానల్లబెల్లి లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా సాగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఎంతో ఆశగా ఉన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎదురు చూడకుండానే కెసిఆర్ ప్రభుత్వం పంటలకు పెట్టుబడి సహాయం అందించేది.ఇప్పటికే రెండుసార్లు ఎగనామం పెట్టిన రైతు భరోస అని కమిటీ పేరు మీద ఐదుగురు మినిస్టర్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగి రిపోర్టు తీసుకుంటున్నామని హెలికాప్టర్ వేసుకుని మరి తిరిగి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది. ఇంతవరకు రైతు భరోసా మీద విధివిధానాలు ఖరారు కాలేదు. ఏదో ఒక సాకు పెట్టి నిజమైన రైతులకు కూడా రైతు భరసని ఆపేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.పీఎం కిసాన్ ని తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ప్రభుత్వంలో 8 లక్షల 89 వేల700 పైచిలుకు రైతులకు రైతుబంధు అందేది.ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 3లక్షల 81 వేల 890 మంది రైతులకు కుదించడం జరిగింది.ఏదో రకమైన ఆంక్షలు పెట్టి రైతులకు రైతుబంధులు కుదించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడున్న వరంగల్ జిల్లాలో రెండు లక్షల 40 వేల టన్నుల ధాన్యం దిగుబడి అయితే కేవలం ఇప్పటివరకు 90 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయలేదు అనే విషయాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జేఏసీ సమాధానం చెప్పాలి. ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినా పి పి సి సెంటర్ వైపుకు రైతులు ఎందుకు రావడం లేదు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రాంతీయ సహకార సంఘాలను నిర్వీర్యం కోసం వరంగల్ జిల్లాలో కుట్ర జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను..
* రైతు భరోసా అనేది ప్రతి రైతుకు అందివ్వాలి. పంట పండిస్తున్న ప్రతి ఎకరానికి ఇవ్వాలి.
* ఇలా లేనిపోని సాకులు పెట్టి ఒక్క పంటకి రైతు భరోసా వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం చెప్పులు, రాళ్లు వాళ్లపై పడతాయి.
* ఈ నెలతోనే ఎకరానికి 15000 చొప్పున రెండు పంటలకు కలిపి ప్రతి ఎకరాకు 30000 చొప్పున రైతు భరోసా బాకీ ఉన్నావు.
* నర్సంపేట నియోజకవర్గం రైతుబంధు గుట్టలకు పంటలు పండని భూమికి రైతు భరోసా ఇచ్చారని అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గుట్టలు పుట్టలు అన్ని తిరిగి పంటలు అంటే పండే ఎకరాలను గుర్తించి రైతు భరోసా రెండు పంటలకు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నాను.
* నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాల్లో రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున రెండు పంటలకి రైతు భరోసా ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
* గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ యాంత్రిక పథకాన్ని నేటి వ్యవసాయ శాఖ మంత్రి మరల తీసుకురావడం అనేది హర్షించదగ్గ విషయం.
* నర్సంపేట నియోజకవర్గం లో వ్యవసాయ యాంత్రికరణ కోసం విడుదలైన 75 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి?….
*ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపిపి, మాజీ మార్కెట్ కమిటీవైస్ చైర్మన్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు , క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు యూత్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు*