Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల శుక్రవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్.బి.ఐ గవర్నర్ గా,ఆర్థిక మంత్రిగా 2004 నుంచి 2014 వరకు భారత దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించారని ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను చేపట్టి దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి నిరంతరం వారు కృషి చేశారని వారి సేవలను స్మరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ పారాసీతయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పిడతల శ్రీను,కాంపాటి శ్రీను, డేగ శ్రీధర్ కౌన్సిలర్లు కోటిరెడ్డి, గంధం యాదగిరి, షాబుద్దీన్, నిరంజన్ రెడ్డి, కర్రీ సుబ్బారావు, పెండెం వెంకటేశ్వర్లు,బాగ్దాద్, భాజాన్, దాదావలి,సిలివేరు వెంకటేశ్వర్లు,రాంబాబు, ముస్తఫా,మునీర్, జహీర్,దేవమణి, మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు……..

Related posts

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

Harish Hs

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Harish Hs

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

TNR NEWS

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

Harish Hs