Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా కొంగర నరసింహారావు…….

తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా కోదాడ పట్టణానికి చెందిన కొంగర నరసింహారావు నియామకం అయ్యారు. ఆదివారం హైదరాబాదులో జరిగిన ఆ సంఘ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు కోదాడ నియోజకవర్గానికి చెందిన మరి కొందరికి జిల్లా కార్యవర్గంలో చోటు దక్కింది. జిల్లా ప్రచార కార్యదర్శిగా గొర్రె రాజేష్, కార్యదర్శిగా పిచికల కోటయ్య, చిట్టిప్రోలు కనకయ్య, నక్క చంద్రశేఖర్ లు జిల్లా కార్యవర్గంలో నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వీరిని రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు నక్క చంద్రం, అనబత్తుల వేణు, కోట నాగభూషణం, రెబ్బ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు……..

Related posts

డివైఎఫ్ఐ ఆద్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

Harish Hs

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు

TNR NEWS

బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష

Harish Hs

విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి

Harish Hs

సాయం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు   ప్రాణాపాయాలతో పోరాడుతున్న వీరమ్మ   సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

TNR NEWS