Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గ్రామాల్లో రైతులు ఎలమాస పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా రైతు కుటుంబాలు పోలెలు, రకరకాల కూరగాయలు, పప్పులతో ప్రత్యేక వంటకాలను చేశారు. ఉదయాన్నే కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పొలాల్లోకి వెళ్లారు. పొలాల్లో భూదేవి అమ్మవారికి పాలు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది ఎలమాస పండుగను నిర్వహిస్తామని రైతులు తెలిపారు. మద్నూర్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎలమాస పండుగను జరుపుకొన్నారు. ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లిన రైతన్నలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ఎలా మాస పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Related posts

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడేవి ఆటపాటలు

TNR NEWS

సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి * నల్లబెల్లి మండలం తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్

TNR NEWS

నేడు జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Harish Hs

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కీసర సంతోష్ రెడ్డి

Harish Hs

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS