కోదాడ పట్టణంలోని 13, 14 వార్డులకు చెందిన నయనగర్ వాసులు బుధవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తమ్మరలోని మామిడి తోటలో ఘనంగా నిర్వహించారు. నిత్యం వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ తీరిక లేకుండా గడిపే వారంతా నూతన సంవత్సరం రోజున ఒకే చోట చేరి ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో కుటుంబ సభ్యులతో సందడిగా గడిపారు. నయా నగర్ వాసులు గణేష్, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇంకా అనేక కార్యక్రమాలు కుల, మతాల భేదం లేకుండా అందరూ ఐక్యంగా ఏకతాటిపై నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు………