Tnrnews.in
తెలంగాణ

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

కిడ్నీ మార్పిడిలో బాధితులను మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్నంలోని శ్రీరంగాపురం చెందిన నరేష్ తో విజయవాడకు చెందిన తాతారావు పృథ్వీరాజ్ మండపేట కు చెందిన గంగారావు రమాదేవి, వీరి తో పాటు మరో ఇద్దరిని ఆశ్రయించాడు.వారు 22 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని కిడ్నీ మార్పిడి చేశారు. ఫోర్జరీ స్టాంపులతో సంతకాలతో సర్టిఫికెట్ను సృష్టించి ఈ ముఠా లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత హాస్పటల్ కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో పోలీసులు నరేష్ నుంచి వివరాలు సేకరించారు దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన ఈ ముఠాను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులు పట్టు పడగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు పదిమంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేత

TNR NEWS

తహసిల్దార్ కార్యాలయంలో ఫైర్ పై అవగాహన  :ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి  : తహసిల్దార్ సంతోష్ కిరణ్

TNR NEWS

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

TNR NEWS

ఆర్యవైశ్యులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

TNR NEWS

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

Harish Hs