రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత అని టిపిసిసి చైర్మన్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో రవాణా శాఖ ఎంవిఐ జిలాని ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా పట్టణంలోని బిఎస్ఎన్ఎల్, బస్టాండ్ అడ్డాల టాక్సీ డ్రైవర్లకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రమాదాలకు అజాగ్రత్త ఒక్కటే ప్రధాన కారణమని జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరగవు అన్నారు ప్రభుత్వం నిర్ణయించిన రోడ్డు భద్రత నిబంధనలను డ్రైవర్లు పాటించాలని సూచించారు. వాహనాల డ్రైవింగ్ lo నిర్లక్ష్యం వహిస్తే తమ ప్రాణం తో పాటు ఇతరుల ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరించారు. మద్యపానం సేవించి వాహనాలు నడపడం అతివేగం అజాగ్రత్త, ఓవర్ లోడ్ వంటివి ప్రమాదాలకు కారణం అవుతున్నాయన్నారు. కోదాడ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ రోడ్డు భద్రత నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు నిబంధనలను అతిక్రమించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా రవాణా శాఖ ప్రమాదాల నివారణకు అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. జనవరి ఒకటి నుంచి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోస్స వాలను నిర్వహించి రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జాతీయ రహదారిపై కోదాడ పరిధిలో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆయన డ్రైవర్లకు వివరించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించి ఆనందంగా జీవించాలని సూచించారు పై అధికారుల ఆదేశాల మేరకు వాహనదారులకు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు భద్రత మహోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కోదాడ ఎం విఐ జిలాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేఎల్ఎన్ ప్రసాద్, లారీ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, బిఎస్ఎన్ఎల్ టాక్సీ అడ్డ అధ్యక్షులు గరిడేపల్లి రమేష్, కార్యదర్శి చేపల శీను, వైస్ చైర్మన్ వాసు, బస్టాండ్ టాక్సీ అడ్డ అధ్యక్షులు పల్లపు వెంకన్న, వైస్ చైర్మన్ ఉసిరికాయల సుబ్బయ్య, కార్యదర్శి ఇరుగు నిరంజన్, ఆయా టాక్సీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.