కోదాడ పబ్లిక్ క్లబ్ కు ఇటీవల ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నికయింది. కాగా ఈరోజు సోమవారం ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి అధ్యక్షులు గాయం పట్టాభి రెడ్డి, కార్యదర్శి బొల్లు రాంబాబు కార్యవర్గం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కోదాడ పబ్లిక్ క్లబ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు శాలువా, పూల బొకేలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేనపల్లి సత్యనారాయణ, చింతలపాటి శేఖర్, ఓరుగంటి రవి, గుండపునేని వేణుగోపాలరావు, గుడిబండ్ల రాజన్ కారుమంచి సత్యనారాయణ పాశం నాగిరెడ్డి పసుపులేటి సత్యనారాయణ నర్ర వంశీకృష్ణ క్లబ్ సీనియర్ సభ్యులు భరత్ రెడ్డి సీతారామయ్య ఎయిర్ ఫోర్స్ వెంకటరెడ్డి, విద్యాసాగర్, హరిబాబు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు……