పతంగులు ఎగరవేయడానికి వాడే చైనా మాంజా వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలిపినారు.సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు సరద కొరకు ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడడం, వాడి పడేయడం వలన ప్రజలకు, పక్షులకు ప్రమాదాల వాటిల్లే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ,ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడుననని తెలిపారు. చైనా మంజా చెట్లకు, ఎలక్రిక్ తీగలకు తగిలి వేలాడి ప్రజలకు మరియు జంతువులకు చుట్టుకుని ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఈ మాంజా తగిలి కొన్ని ప్రాంతాలలో ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కావున విక్రయదారులు ఎవ్వరయిన చైనా మంజా నిలువచేసిన, అమ్మిన, వాడిన డయల్ 100 కి గాని సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపారు.