Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

చేవెళ్ల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన దుకాణాల సముదాయం మరియు గోదాములను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గోదాములను రైతులు వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ భీం భరత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం‌, ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ యువజన నాయకులు మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొదటి వర్ధంతి సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదానం

TNR NEWS

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు 

TNR NEWS

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS

కోమరబండ లో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఎస్పీ నరసింహ

TNR NEWS

కోదాడ లో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS