Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, పిసిసి డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం బైపాస్ రోడ్డులో గల మైదానంలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రం ప్రీమియర్ లీగ్ 3 పోటీలను డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ట్రస్ట్ అధ్యక్షులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో కోదాడ నియోజకవర్గంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను వారిని ప్రత్యేకంగా అభినందించారు. యువత విద్యతోపాటు క్రీడ రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కత్రం కిరణ్ కుమార్ రెడ్డి, ముడియాల సత్యనారాయణ రెడ్డి, వేనేపల్లి నరేష్ రావు, ముడియాల బాబి,మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబు, పైడిమర్రి సత్తిబాబు, ఉమా శ్రీనివాసరెడ్డి, బాల్ రెడ్డి,ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, డేగ శ్రీధర్, ముత్తవరపు రామారావు, ఈదుల కృష్ణయ్య, పట్టాభి రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు…………

Related posts

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి  ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ కు వినతిపత్రం అందజేత

TNR NEWS

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS