ఇటీవలే ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పులి వెంకటేశ్వర్లు,గుగులోతు వెంకటేశ్వర్లు,ఎండి ఇస్మాయిల్ లకు స్వేరొస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో స్థానిక శిల్పి రెస్టారెంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చెరుకుపల్లి కిరణ్ మాట్లాడుతూ ట్రైనింగ్ పూర్తిచేసుకుని బాడ్జిని పొందడం ఎంతో ఆనందించదగ్గ విషయమని వారు అన్నారు.వెనకబడిన వర్గాల ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.నిత్యజీవితంలో ఎంతో క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగిస్తూ,వృత్తి పట్ల అంకితభావంతో అంతే పేరు ప్రఖ్యాతలు సంపాదించారని అన్నారు.సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రజలకు ఎనలేని సేవలు అందించి అంతే పేరు తెచ్చుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్,గంధం బుచ్చారావు,ఎంఈఎఫ్ జాయింట్ సెక్రెటరీ పులి శ్రీనివాస్,పిడి పంది కళ్యాణ్,శిల్పి సుధాకర్,గుండ్లపల్లి రామారావు,చెడపంగు నాగార్జున స్వేరో,పాముల రాకేష్ స్వేరో,బీసీ నాయకులు చలిగంటి రామారావు,మైనార్టీ నాయకులు భాజన్,రఫీ తదితరులు పాల్గొన్నారు.
next post