Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

చేవెళ్ల

తాను పార్టీ మారుతున్నట్టు ఆదివారం కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తలను డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, పార్టీ మారుతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఇదే నిజం’ దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, సరైన గుర్తింపు ఉందన్నారు. రాజకీయాల్లో గిట్టని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ నేను పార్టీ మారుతున్నాను అంటూ దుష్ప్రచారం చేయిస్తున్నారని వెళ్లడించారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకులకు కనీసం ఆత్మ తృప్తి కావాలంటే వారే బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కృష్ణారెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ కాదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలం పాలన చూసి బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటికి వరకు ఉచిత బస్సు మినహాయిస్తే ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ప్రజలు మరోసారి కేసీఆర్ ను సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇటీవల షాబాద్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు తాను దూరంగా ఉన్నానని పత్రికలో వార్త రావడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గలిగిన పార్టీ అని, షాబాద్ రైతు మహాధర్నా సభావేదిక పైన పార్టీ ముఖ్య నేతలు మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలకు గౌరవం, ప్రాధాన్యతనిచ్చి తాను వెనక వరుసలో ఉన్నానని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా అసత్య ప్రచారాలు చేయొద్దని కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related posts

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

Harish Hs

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా స్వరూప రాణికి అవార్డు

TNR NEWS

సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ పై అవగాహన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

TNR NEWS