బానోత్ బిక్షం నాయక్ మరణం సమాజానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం మోతే మండలం బిఖ్యా తండా గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్ బిక్షం నాయక్ (90) మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం లో ఈ ప్రాంతం నిర్వహించిన పాత్ర మరువలేదని అన్నారు. నాటి పోరాటం నుండి నేటి వరకు జరిగిన అనేక పోరాటాలలో బానోతు బిక్షం నాయక్ పాల్గొన్నారని అన్నారు. బానోతు బిక్షం నాయక్ కుటుంబం మొదటినుండి సిపిఎం పార్టీ కి అండదండలు ఇస్తూ ఈ ప్రాంతంలో ఎర్రజెండాను నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర బానోతు బిక్షం నాయక్ పోషించారని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, బానోతు లచ్చరాం నాయక్, దోసపాటి శ్రీనివాస్, డివైఎఫ్ఐ మోతే మండల అధ్యక్షులు వెలుగు మధు చేగువేరా, బిక్క తండా సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి భానోత్ వెంకన్న, నాయకులు బానోత్ శంకర్, బానోతు రమేష్ నాయక్, సైదా, వెంకన్న, కిషన్, రమేష్, చంద్రు నాయక్, గోలియా తదితరులు పాల్గొన్నారు.
previous post
next post