రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖలో సమగ్ర మార్పులపై డిప్యూటీ సీఎం దృష్టి సారించారు. తాజాగా ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని పవన్ తెలిపారు.