- కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
యు.కొత్తపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) మరియు జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తుఫాను ప్రభావం ఏర్పడిన పంట పొలాల్లో పర్యటించారు. తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తక్షణమే పంట నష్ట జాబితా సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు, సినీ నటుడు డా. బి.ఎన్.రాజు, నాయకులు డా. జ్యోతుల శ్రీనివాస్, ఓదూరి నాగేశ్వరరావు, జనసేన కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
