February 3, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..

Related posts

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలి అందరూ కలిసిమెలిసి జీవించడం సూర్యాపేట సంస్కృతి సూర్యాపేట పోరాటాల పురిటిగడ్డ ఇక్కడ వ్యాపారులు ఉద్యమాలలో పాల్గొని తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది

TNR NEWS

బడుగు బలహీన వర్గాల బాగు కోసం కులగణన సర్వే    బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs