Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా నిర్వహించాలి

సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి వరంగల్ -ఖమ్మం -న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పై అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెబెక్స్ ద్వారా ఆర్డీఓ లతో,తహసీల్దార్ లతో , ఎంపిడిఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని జనవరి 29 నాడు విడుదల చేయడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కలేక్టర్ తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 3 నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని,ఫిబ్ర‌వ‌రి 10 నామినేషన్లు వేయుటకు చివరి రోజు,ఫిబ్ర‌వ‌రి 11 నాడు నామినేషన్లు స్క్రూటిని, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఫిబ్ర‌వ‌రి 13 చివరి రోజు,ఫిబ్ర‌వ‌రి 27 నాడు ఉద‌యం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వ‌ర‌కు పోలింగ్ ,మార్చి 3 నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ అన్నారు.జిల్లాలో 2679 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి జాగ్రత్తగా అమలు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఈ సందర్బంగా సూచించారు.ఈ సమావేశం లో డి ఆర్ డి ఓ పి డి వివి అప్పారావు, డి పి ఓ నారాయణ రెడ్డి, ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు, ఎలక్షన్ డిటి వేణు,ఆర్డీఓ లు, తహసీల్దార్ లు,ఎంపిడిఓ లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

కార్పెంటర్ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

TNR NEWS

“ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల అధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం “

Harish Hs

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS