Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ….పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు,ఉత్సాహం వ‌స్తుంద‌ని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు.పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని,ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం,మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని,మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,ఏఆర్ ఏ సి పి సుందర్ రావు,ఆర్ ఐ వామన మూర్తి, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Harish Hs

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

TNR NEWS

దారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి.

TNR NEWS