కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి లా ఉందిని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రైతాంగానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి రంగానికి నిధులు పెంచలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఊసే లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు, రైతు నాయకులు నిరాహార దీక్ష చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్ లో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల ఊసే లేదన్నారు. సబ్సిడీలను పూర్తిగా తగ్గించి ప్రజలపైపన్నుల భారం మోపారని ఆరోపించారు.
వ్యవసాయ రంగానికి 2 శాతం నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.