Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సవరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మునగాల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ తెలంగాణ గ్రామపంచాయతీ సిబ్బంది లందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 ని సవరించి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయితీ సిబ్బంది నందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్, ఈఎస్ఐ,పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.

 ఈ కార్యక్రమంలో ఎల్ నాగార్జున, ఎం ఎంకన్న, ఎం ముత్తయ్య, పరుశురాములు, రాజు, సీతారాములు, సైదులు, నాగరాజు, వీరయ్య, రఘు, టీ ముత్తయ్య, సాగర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

TNR NEWS

రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి

TNR NEWS

అంగరంగ వైభవంగా శ్రీసీతాలమ్మ,మడేలేశ్వర, పోతురాజు స్వాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు

TNR NEWS

వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ మొరం వేయాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

TNR NEWS

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS