Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సత్యంబాబు, కరస్పాండెంట్ కె.వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుమంగళీ ఫంక్షన్ హాల్ లో ప్రతిభ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధించవచ్చునని అన్నారు.జీవితంలో ఏది సాధించాలన్న చదువుతోనే సాధ్యమన్నారు.ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపుతిప్పే కళాశాల స్థాయి చదువును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చునని చెప్పారు. తమ కళాశాల విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలతో పాటు వివిధ ఎంట్రెన్స్ టెస్టులలో కూడా జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలలో కళాశాల లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

TNR NEWS

జీవీకే ఫ్యామిలీ హోటల్& రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Harish Hs

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

TNR NEWS

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS