Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

కరీంనగర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఓ పెన్ కేటాగిరీలో భారీ మెజార్టీ లభించింది.

ఈ సందర్భంగా మహ్మద్ అజీమ్ విలేకరులతో మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన ఏడాది కాలం సమర్థవంతంగా కొనసాగింది. ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుతో ప్రజల మన్ననలు పొందాం,” అని అన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా పని చేస్తానని, పార్టీ పటిష్ఠత కోసం పాటుపడతానని అజీమ్ తెలిపారు. యువతకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తాన అని హామీ ఇచ్చారు.

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అజీమ్ తెలిపారు.

“నాకు భారీ మెజార్టీ రావడానికి కృషి చేసిన కాంగ్రెస్ శ్రేణులకు, యువతకు రుణపడి ఉంటాను,” అని అజీమ్ పేర్కొన్నారు.జీమ్ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

సమగ్ర సర్వే చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

TNR NEWS

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs