Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..గర్భిణు లు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాలలో ఇచ్చే పోషకాహారం విశిష్టతను తెలియజేస్తూ అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సమన్వయంతో ఆరోగ్య సేవలు అందించాలన్నారు. చిన్న పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఉమ్మనీరు సమస్య, పుట్టగానే శ్వాస ఆడక పోవడం, పోషకాహార లోపం, నిమోనియా తదితర సమస్యలతో మరణాలు సంభవిస్తుంటాయని వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ వినయ్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…..  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

అక్రమ లేఔట్ లను ఎల్.ఆర్.ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయవద్దు…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి

TNR NEWS

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Harish Hs

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs