కొన్ని విషాద ఛాయలు
మనసుని కన్నీటి పర్యంతం చేస్తాయి
కదిలే మబ్బుల్లా కలవరం రేపుతూ
క్షణకాలపు ఏకాంతాన్ని కఠినంగా మార్చేస్తాయి
ఎగసిపడుతున్న సంద్రపు అలలా ముంచేసి
నిశ్శబ్దపు గీతికలను పాడిస్తాయి
ఒక్కో ఆలోచన
గుండె గదులను రంపంతో కోస్తున్నట్లు
అంతు చిక్కని ఆవేశాన్ని నింపుకుని గమ్యం లేని పయనం చేస్తున్నట్లు
రాక్షస విన్యాసాలను రెప్పవాల్చక చూస్తున్నట్లు
సంద్రపు లోగిళ్లలో సమయం పరిభమిస్తున్నట్లు
భావోద్వేగపు భ్రమనాలన్నీ దిక్సూచిని మరచినట్లు
రోధసిని వీడి ఉల్కలన్నీ ఊడి భూమిని చేరినట్లు
వింతలన్నీ విస్తుపోయి
ఆశలన్నీ ఆవిరయ్యి
ఆకాశపు సదనమున
ఆవిరైన కన్నీటితో
కాలయాపన చేస్తూ
కనుమరుగే కాని జ్ఞాపకాల ఒరవడితో ఊసూలు చెబుతూ
శశి అంకమున సేద తీరుతూ వాలింది తొలి పొద్దు…
- పోలగాని భాను తేజశ్రీ, కృష్ణాజిల్లా
Save or share this story as a newspaper-style Epaper Clip:
