Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారిత దిశగా అడుగులు

  • లాల్ బజార్ లో పియంఓ షాపును ప్రారంభించిన డా ఉమర్ ఆలీషా 

హైదరాబాద్, ఏప్రియల్ 13 : సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ లో ఉన్న లాల్ బజార్ కూడలిలో మహిళలచే నిర్వహించబడే పియంఓ (ప్రకృతి మాతృ ఆర్గానిక్) షాపును పిఠాపురం పట్టణానికి చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యులు రిబ్బన్ కట్ ప్రారంభించారు. తొలుత ఆయన షాపులో పూజా క్రతువుని పూర్తిచేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీ సాధికారత సమాజానికి ఎంతో అవసరమని, సహజ సిద్ధంగా మాతృమూర్తుల స్వహస్తాలతో వండిన వంటకాలను సమాజానికి అందించడం ద్వారా ఎంతో మేలు కలుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్వకాలపు మనుగడకు దూరంగా యాంత్రిక జీవితం గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర నగరవాసులకు అతి చేరువుగా సహజ సిద్ధమైన ఆర్గానిక్ పిండి వంటలను చేరువ చేయాలన్న సంకల్పంతో మాతృమూర్తులు చేపట్టిన ఈ కార్యక్రమం శుభప్రదం కావాలని, ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రాజ్యలక్ష్మి, ఉమా, సునీత, చందులను గురువర్యులు దీవించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన నగర ప్రముఖులకు షాపు యాజమాన్యం ఆర్గానిక్ పిండి వంటలను గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ సభ్యులు, పీఠం పిఆర్ఓ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర, సీనియర్ జర్నలిస్ట్, సినీ నటుడు, రచయిత బత్తుల ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

Dr Suneelkumar Yandra

ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పింగళి ఆనంద కుమార్‌కు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక బెస్ట్ డాక్టర్ అవార్డు – 2026 ప్రదానం

TNR NEWS

నేటి నుంచి పాపికొండల బోటింగ్​ నిలిపివేత

TNR NEWS

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

TNR NEWS

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra