Tnrnews.in
తెలంగాణ

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలి… అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దళితులు ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఏస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి మంగళవారం రాత్రి కోదాడ మండలం గొండ్రియాల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న పాలకులు రాజ్యాంగం ద్వారా దళితులకు కల్పించబడిన రిజర్వేషన్లు తీసేసే ప్రమాదముందన్నారు. క్రిస్టియన్ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్ష చేయాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అరికట్టాలని అన్నారు. టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యామ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రయోజనాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని అన్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకొని ఉపయోగించుకోవాలని అన్నారు. అంబేద్కర్ అందరికి సమాన అవకాశాలు కల్పించడానీ అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం యువత కృషి చేస్తూ కష్టపడి బాగా చదువు కోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జీవితాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాడిన పాటలు, నృత్యాలు ప్రజలను బాగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బట్టు గోపి గ్రామ సర్పంచ్ కలకొండ లచ్చయ్య,గ్రామస్థులు పిదమర్తి బాబురావు,భరత్, లక్ష్మీ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

మహాత్మగాంధీని మరోసారి హత్య చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం  మునగాల మండలం నరసింహుల గూడెం   జిల్లా కమిటీ సభ్యురాలు, గ్రామ కార్యదర్శి……

TNR NEWS

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

TNR NEWS