Tnrnews.in
తెలంగాణ

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

సూర్యాపేట: అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం లేని వారికి కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నేటికి అమలు కాలేదు అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తుదారుల పింఛన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం నేటికీ పెంచలేదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12000 ఇస్తామని చెప్పిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతాంగానికి రైతు భరోసా, రుణమాఫీ నేటికి పూర్తి కాలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు తంగిళ్ళ వెంకటచంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన సైదమ్మ, జిల్లా నాయకురాలు త్రివేణి, సుందరి రమాదేవి, భాగ్యమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

Harish Hs

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS

వారం రోజుల్లోగా మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ : సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు

Harish Hs