సూర్యాపేట జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు,జిల్లా యంత్రాంగం,బాలల రక్షణ,లేబర్, రెవెన్యూ, హెల్త్ మొదలగు డిపార్ట్మెంట్ ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంను పగడ్బందిగా నిర్వహించామని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 197 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సమరక్షులకు క్షేమంగా అప్పగించడం జరిగినదని అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు బాలురులు 82 మంది, బాలికలు 15 మంది ఉన్నారు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు బాలురు 75 మంది బాలికలు 22 మంది ఉన్నారని తెలిపారు.అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ గుర్తించి వీరికి రక్షణ కల్పించడం జరిగిందని అన్నారు. ఆపరేషన్ స్మైల్ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని చేరేలా సిబ్బంది అందరూ బాగా పని చేశారు, భాలల రక్షణలో తనిఖీలు నిరంతరంగా నిర్వహిస్తామని అన్నారు. బాలల వికాసానికి, బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని కోరినారు. వెట్టిచాకిరి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా 197 మంది పిల్లలను గుర్తించడంలో బాగా పని చేసిన పోలీసు సిబ్బంది, జిల్లా బాల రక్షణ అధికారులను, వివిధ శాఖల సిబ్బంది అందరినీ అభినందిస్తున్నామని అన్నారు.
చదువులతో మంచి భవిష్యత్తు ఉన్నది అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి, ప్రభుత్వాలు ఉచిత వసతి తో కూడిన విద్యను అందిస్తున్నాయి, పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.