- నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఎస్ఆర్ఎం పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి అన్నారు. బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు అలరించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తమ పాఠశాలలో విద్యతోపాటు చిన్ననాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేందుకు తమ పాఠశాలలో సరైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రంగురంగు చీరలతో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు………..
previous post