రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన ఇద్దం నవీన్ రెడ్డి అనే యువ రైతు ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన ఇద్ధం నవీన్ రెడ్డి తన సొంత పొలంలో ట్రాక్టర్ కేజీ విల్స్ తో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో నవీన్ రెడ్డి బురదలో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే దుర్మరణం చెందాడని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.