: హెడ్ కానిస్టేబుల్ గా శ్రీనివాస్ ఏఎస్ఐ గా పదోన్నతి పొందడం సంతోషకరమని కోదాడ నియోజవర్గ యూనైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రివరెండ్ వి యేసయ్య పాస్టర్ అన్నారు.. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విధుల పట్ల బాధ్యతగా నిర్వర్తించినందుకే పోలీస్ అధికారులు గుర్తించి పదోన్నతి ఇవ్వడం జరిగిందని ఆనంద వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ప్రభుదాస్, తోటి పాస్టర్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
