పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లు వాడుకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. మునిసిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు కుప్పలు కుప్పలుగా దొరికాయి, తనిఖీలకు సమాచారం తెలుసుకున్న కొందరు దుకాణదారులు షాపులు మూసివేశారు.ప్లాస్టిక్ కవర్లలో వస్తువు లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
