మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమ్మ నాన్న ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ వి ప్రసాద్ పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామంలో లక్ష్మి తిరుపతమ్మ గోపమ్మ స్వాముల జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన తెలుగు రాష్ట్రాల మహిళ ఇన్విటేషన్ కబడ్డీ పోటీల్లో బెస్ట్ రైడర్, డిపెండెర్ కు రెండు బహుమతులు కబడ్డీ నిర్వహణ కమిటీ, ఆలయ చైర్మన్,నిర్వహణ కమిటీతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వహణ కమిటీ మరియు చైర్మన్ మాట్లాడుతూ..జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ క్రీడా క్రీడాకారులకు రెండు బహుమతులు అందజేసిన ఎల్.వి ప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ వి ప్రసాద్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.