*కౌటాల* మండలం మోగడ్ దగడ్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సమయం ఎంతో విలువైనదని చాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు చెంచులక్ష్మీ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థు లకు టైం మేనేజ్మెంట్పై పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ ప్రతి క్షణం ఎంతో విలువైనదని, గడిచిన కాలం తిరిగి రాదు కాబట్టి ముందున్న మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్షణం వృధా చేయకుండా చదవాలని ఆమె సూచించారు. పాఠశాలలో ఉత్తమ మార్కులు సాదిస్తున్న చరణ్ కుమార్ ను సన్మానించి షీల్డ్ను అందించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెచ్ఎం శ్రీనివాస్, క్లబ్ కార్యదర్శి హరీష్, రంజిత్, లక్ష్మీ, నందరాం, పద్మ, శృతి, మైనిక, దర్శన, దుర్గా, గణేష్, సుజాత, తదితరులు పాల్గొన్నారు..
