మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో బి.ఆర్.ఎస్. పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలను కలకోవ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ మాజీఅధ్యక్షులు సుంకరి శ్రీను ఇంటివద్ద కెసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో పార్టీనాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బెల్లంకొండ చిన్న వెంకన్న గౌడ్, మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విసిగిపోయారని, తిరిగి కెసిఆర్ పాలన రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాలనలో అన్నిరంగాలలో వైఫల్యం చెందిందని, ప్రజలకు ఇచ్చిన హమిలను అమలు చేయడం లేదని అన్నారు.కాళేశ్వరం జలాలు విడుదల చేయక పోవడం వలన పంటలు ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ మాజీ బీసీ సెల్ అధ్యక్షులు సుంకర శ్రీను,మాజీ సర్పంచ్ మండవ సత్యనారాయణ, బి.ఆర్.ఎస్.పార్టీ మాజీమండల ఉపాధ్యక్షులు మండవ వెంకన్న గౌడ్,మాజీవార్డ్ మెంబర్లు మునగలేటి వీరబాబు, బచ్చు శ్రీను,మాజీ కోఆప్షన్ సభ్యులు పనస వీరయ్య, గ్రామశాఖ ఉపాధ్యక్షులు తొండల లింగయ్య, మునగలేటి నాగయ్య, పాతకోట్ల వెంకన్న, మొక్క బోస్, కుక్కడుపు సైదులు,సురభి రామచంద్రయ్య, మునలేటి నవీన్, బీ.ఆర్.ఎస్ మహిళానాయకురాలు సుంకర వాణి, తొండల నరేష్, మండవ నవీన్,మండవ ప్రవీణ్, సిర్ర,సైదులు,పనస శ్రీను,కలపాల సైదులు,తదితరులు పాల్గొన్నారు.