పిఠాపురం : పట్టణంలోని సీతయ్య గారి తోటలో వున్న ఆదిత్య పాఠశాలలో ఉదాన్11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యం, బుర్రకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిత్య పాఠశాల పూర్వం విద్యార్థి, ప్రస్తుత కొవ్వూరు ఆర్డిఓ రాణిసుస్మిత జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదివితే విజయాలు వరిస్తాయని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థలు చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపాల్ విజయసారథి, డాక్టర్ మొగిలి కాశీవిశ్వనాథం, రేవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.