Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

పిఠాపురం : ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన కుటుంబంలో సమస్యలు, మన గ్రామంలో సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్ర వేత్తలు తయారై, మానవత్వపు విలువలు పరిమళింపబడి, మానవ జన్మను సార్ధక్యం చేసుకోవచ్చని డా.ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అనేక దేశాల వారు ఆచరిస్తూ, సుఖ సంతోషములతో జీవించవచ్చు అని డా.ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చంద్రంపాలెం శాఖ వారి ఆధ్వర్యంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అధ్యక్షతన జ్ఞాన చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సభలో తాత్విక బాలవికాస్ చిన్నారులు ఎస్.ఉమా వరప్రసాద్, జి.చాందిని, ఎస్.ఉషా కిరణ్, టి.హరితేశ్వరి, ఎస్.కృష్ణప్రసాద్, జె.లహిరి, జి.ఉమాదేవి, ఎస్.ఈశ్వర్ లు చెప్పిన ప్రసంగాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సాధనాల వెంకటేశ్వరరావు, శాంతికుమారి దంపతులు, గొల్లపల్లి నూకరాజు, వీరమణి దంపతులు స్వామి వారిని శాలువతో సత్కరించారు. సాధనాల వెంకటేష్, వీరమణి దంపతులు స్వామి వారిని పుష్పమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో వందలాది సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులుతో గౌరీ నాయుడు మర్యాదపూర్వక భేటీ

Dr Suneelkumar Yandra

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra

నీ ఆలోచనే – నీ విజయం

Dr Suneelkumar Yandra

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra