పిఠాపురం : ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన కుటుంబంలో సమస్యలు, మన గ్రామంలో సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్ర వేత్తలు తయారై, మానవత్వపు విలువలు పరిమళింపబడి, మానవ జన్మను సార్ధక్యం చేసుకోవచ్చని డా.ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అనేక దేశాల వారు ఆచరిస్తూ, సుఖ సంతోషములతో జీవించవచ్చు అని డా.ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చంద్రంపాలెం శాఖ వారి ఆధ్వర్యంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అధ్యక్షతన జ్ఞాన చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సభలో తాత్విక బాలవికాస్ చిన్నారులు ఎస్.ఉమా వరప్రసాద్, జి.చాందిని, ఎస్.ఉషా కిరణ్, టి.హరితేశ్వరి, ఎస్.కృష్ణప్రసాద్, జె.లహిరి, జి.ఉమాదేవి, ఎస్.ఈశ్వర్ లు చెప్పిన ప్రసంగాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సాధనాల వెంకటేశ్వరరావు, శాంతికుమారి దంపతులు, గొల్లపల్లి నూకరాజు, వీరమణి దంపతులు స్వామి వారిని శాలువతో సత్కరించారు. సాధనాల వెంకటేష్, వీరమణి దంపతులు స్వామి వారిని పుష్పమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో వందలాది సభ్యులు పాల్గొన్నారు.