జోనల్ ఇంచార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనదని కొనియాడారు. దానిలో పాఠశాల దశ ముఖ్యమైనది అన్నారు. చిన్నతనము నుండే విద్యార్థులు తల్లిదండ్రుల అవసరాలు తీర్చడం ఎంతో అవసరం అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. విద్యార్థికి విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ఫైనల్ ఎగ్జామ్ సమీపిస్తున్న సమయంలో విద్యార్థికి ఆరోగ్యం ఎంతో ప్రాధాన్యమైనదని తెలియజేశారు. ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఈ కొన్ని రోజులు ఎంతో ప్రాధాన్యమని తెలియజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

previous post