November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు.

బుధవారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్,స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు .ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తేది 17.11.2024 నఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష ( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు), సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని, తేది 18.11.2024 న ఉదయం 10. 00 గంటలనుండి

మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని కలెక్టర్ తెలిపారు. టిజిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షలు సజవుగా,ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు అని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 16,543 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 50 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అభ్యర్థులు (i) నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు (ii) పెన్సిల్ & ఎరేజర్ (i) హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో (iv) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలి. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే వ్రాయాలి. సెల్ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 163 బియన్ యస్ యస్ (BNSS)సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరిష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ పి.రాంబాబు , అదనపు ఎస్పీ నాగేశ్వర రావు, జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

TNR NEWS

బీసీ రిజర్వేషన్ల అమలు కు 5న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS

గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ప్రజలకు మంచినీరు కోసం పబ్లిక్ నల్లాలు బోరింగ్ లు వేయించి ప్రజల దాహార్తిని తీర్చాలి

TNR NEWS