కోదాడ డివిజన్లో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని,నీటి సరఫరా కోరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కోదాడ డివిజన్లో మంచినీటి సరఫరా పరిస్థితిపై ఎంపీడీవో లు , ఎంపీడీవో లు,మున్సిపల్ కమిషనర్లు,రూరల్ వాటర్ సప్లై విభాగం ఈఈ,డిఇ లు, పంచాయతీ సెక్రటరీలు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.వేసవికాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు.మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితిలో నీటి సరఫరా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. కోదాడ డివిజన్ లోని మండల, గ్రామాల వారిగా నీటి సరఫరా కొరకు పైపులైన్లు లీకేజీలు, మరమ్మత్తులు,సరఫరా సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.మండలాలలో అలాగే మున్సిపాలిటీలలో బోర్ల పనితీరును పరిశీలించాలని తప్పనిసరిగా క్లోరినేషన్ చేసిన తర్వాతనే నీటి సరఫరా జరపాలని తెలిపారు.ప్రతి మండలంలోని నీటి నిల్వలను,గ్రామాల వారీగా ట్యాంకులు యొక్క కెపాసిటీని అందుతున్న సరఫరాను కలెక్టర్ పంచాయతి సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ సప్లై అన్ని గ్రామాలకు మున్సిపల్టీలకు అందాలని, నీటి పంపిణీ ఓచ్చార్స్ ద్వారా జరగాలి, క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి, సరఫరాలో ఎక్కడ లోపం లేకుండా చివరి ఇంటి వరకు నిరందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే లోకల్ సోర్స్ ద్వారా త్రాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామాలలోని బోర్లను కూడా పరిశీలించి, వాటి నీటిని క్వాలిటీ చెక్ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీలో లేబర్ మొబిలైజేషన్ కోదాడ డివిజన్ చాలా తక్కువగా ఉందని,అన్ని గ్రామాలలో సుమారు 100 మంది కూలీలు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు గ్రామంలో జరిగే అన్ని పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని పంచాయతీలలో గల బోర్వెల్స్ వద్ద నీటిని వృధా కాకుండా, బోర్ వెల్స్ వద్ద రీఛార్జి స్ట్రక్చర్స్ ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.నర్సరీలలో జర్మినేషన్ సరిగా కనిపించడం లేదని చలవ పందిళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంజిఎన్ఆర్జిఎస్ కింద చేపట్టిన సిసి రోడ్లు చేసేవారితో పంచాయతీ కార్యాలయాల్లో, అవసరమైన పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం గొప్ప భాగ్యంగా భావించి పనిచేయాలని ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం ఇస్తే చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి మాత్రమే అందాలని రాష్ట్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సూర్యాపేట జిల్లా ముందుండాలని కలెక్టర్ తెలిపారు.మండలాలలో మోడల్ హౌస్ లో నిర్మాణం జరుగుతున్నవని వాటిని ఒకసారి అందరూ తప్పక పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ,కుటుంబ బాధ్యత కూడా అంతే ముఖ్యమని, ఉద్యోగులందరూ తప్పక హెల్మెట్ వాడాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో వివి అప్పారావు,ఆర్డీవో సూర్యనారాయణ,మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ అధికారులు శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి, డిపిఓ నారాయణరెడ్డి, డిఎల్పిఓ యాదయ్య, తాసిల్దార్ వాజిద్,కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ రమాదేవి, ఎంపీడీవోలు, ఎంపిఓలు, ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, పాల్గొన్నారు.