ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జర్నలిస్టు పడిశాల రఘు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రఘు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదివారం కోదాడ పట్టణం అంబేద్కర్ కాలనీలోని రఘు నివాసానికి వెళ్లి మాదిగ జర్నలిస్టు ఫోరం, ఎంఆర్పిఎస్ నాయకులు తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న రఘు సమాజంలో మార్పునకు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం నిస్వార్ధంగా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. రఘు కుటుంబానికి మాదిగ జర్నలిస్టు ఫోరం ఎమ్మార్పీఎస్ పక్షాన అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, ఎం జె ఎఫ్ జిల్లా నాయకులు పిడమర్తి గాంధీ, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, ఎం జె ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, ఎం జె ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చీమ శేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు, కాంపాటి శ్రీను, గంధం యాదగిరి, గంధం పాండు, బెజవాడ శ్రావణ్, రావి స్నేహాలత చౌదరి, తమలపాకుల లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి కోటేష్, గుడిపాటి కనకయ్య, ఏపూరి సునీల్ రత్నాకర్, మిట్ట గడుపుల మోసయ్య, మల్లెపంగు సూరి, మొలుగూరి సైదులు తదితరులు పాల్గొన్నారు……..

previous post
next post