మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజు భోగి పండుగ రోజున రాళ్ల బాబు సెంటర్ లో మరియు (రెండవ రోజు) మంగళవారం కూడా ఎస్సీ కాలనీలో అమ్మ నాన్న ఫౌండేషన్ కు చెందిన స్వర్గీయ రత్నమాల జ్ఞాపకార్థం సామాజిక సేవ కార్యకర్త, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం సైదులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునగాల ఎస్ ఐ బి ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ శాఖమూడి అప్పారావు, లకుమారపు వరప్రసాద్, లకుమారపు నాగరాజు, తాడ్వాయి సింగల్ విండో చైర్మన్ తొగరు సీతారాములు, న్యాయ నిర్ణేతులుగా పుష్పలత, పద్మావతి, సమత, ఉమా, యూత్ సభ్యులు జిల్లా నరేష్, రామయ్య, చికెన్ సెంటర్ జానీబాబు, ఎండి రషీద్, ఎల్ శ్రీనివాస్ (వాటర్), ఎల్ శ్రీనివాస్, గట్టు వెంకన్న, ఎల్ వెంకయ్య, రోడ్డు శ్రీనివాస్, కే ఏసు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post