Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని కృష్ణానగర్, గణపవరం, గ్రామాల్లో నర్సరీని సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎండలు ఎక్కువైనందున నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో నీటిని అందించాలని నర్సరీల నిర్వహకులకు సూచించారు. ఎండల నుండి మొక్కలను కాపాడేందుకు షెడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కల సంరక్షకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా మొక్కలు ఎండిపోతే తక్షణమే వాటి స్థానంలో కొత్త మొక్కలను సిద్ధం చేయాలన్నారు.నర్సరీలో మొక్కల పెంపకంలో అలసత్వం చూపొద్దని, నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు.నర్సరీలపై షెడ్‌నెట్లను మొక్కలకు గాలి తగిలేలా ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా నర్సరీల నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఏపీవో, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs

ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: కే.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్

TNR NEWS

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS