సూర్యాపేట టౌన్: గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తిపన్ను వన్ టైం సెటిల్ మెంట్ 90% వడ్డీ రాయితీ మున్సిపాలిటీలకు వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీతారామపురంలో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024- 2025 సంవత్సరం సంబంధించిన ఆసిఫన్ను చెల్లించే వారి కి వడ్డీ 90% రాయితీ ఇవ్వడం ద్వారా ఇంటి పన్నులు 100 శాతం పూర్తయి మున్సిపాలిటీలకు ఆదాయం రావడానికి అవకాశం ఉందని అన్నారు. అనేక ప్రాంతాలలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని వాటి వసుల కోసం ఈ రాయితీ స్కీమ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలు ఉండకుండా జిహెచ్ఎంసి తరహాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు,నగర పంచాయతీలకు తొంబై శాతం ఆస్తి పన్ను వడ్డీ మాఫీ ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, నగిరి జయమ్మ, పిట్టల రాణి, గంగపురి శశిరేఖ, ఒట్టే ఎర్రయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
