Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వజ్రకవచధర గోవింద గోవింద

కాకినాడ : భోగిగణపతి పీఠంలో శనివార సుప్రభాత వేళలో వజ్రకవచ స్తోత్రంతో వేంకటేశ్వరస్వామి వారికి 78వ జపయజ్ఞపారాయణను  శ్రీవారి సేవకులు నిర్వహించారు. పండ్ల రసాలతో అభిషేకం, సప్తగిరుల నారికేళ సమర్పణ, గోవింద సంకీర్తన, తోమాలసేవ జరిగింది. దీపారాధకులకు పసుపు, కుంకుమ, తాంబూలాలతో రవికలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి 14వ శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి బంగారు తులసిదళాలు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వజ్రకవచ ఆభరణాలతో పూజా కైంకర్యాలు చేయించి ధన్యులయ్యారన్నారు. శ్రీవారి పారాయణలో వజ్రకవచధర గోవింద స్తోత్రం అత్యంత మహిమాన్వితమన్నారు. శ్రీవారి పాదాల వద్ద బియ్యపుపిండి, అరటిపండు గుజ్జు, బెల్లం, ఆవుపాలతో కలిపి తయారు చేసిన ప్రమిదల్లో ఆవునెయ్యితో వెలిగించే సప్తజ్యోతులతో 7శనివారాలు ఆరాధన చేయడం వలన శ్రీకర శుభాలు కలుగుతాయని, ప్రారబ్ధ కర్మల పారిహరం ఏలినాటి శని ప్రభావం, రాహు, కేతు దోష నివారణ కలుగుతుందని పీఠం తెలియజేసింది. అర్చన అనంతరం వీటిని సముద్ర జలాల్లోకి నిమజ్జనం చేయడం వలన జల భూగర్భ చరాలు స్వీకరించి మానవ జన్మకు మోక్షాన్ని పొందే భాగ్యం కలుగుతుందన్నారు. భాగ్యసిద్ది పొందే శ్రీవారి పారాయణ లోక కళ్యాణానికి శ్రీకరమైన జపయజ్ఞమని తెలిపారు.

Related posts

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం

Dr Suneelkumar Yandra