Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

కోదాడ చెరువు కట్టపై ఉన్న కంపచెట్లను తొలగించి ఉదయాన్నే వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. గురువారం చెరువు కట్టపై కంప చెట్లు మొలిచి ఇబ్బందిగా మారడంతో ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావులు కమిషనర్ రమాదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో వెళ్లి పరిశీలించారు. కోదాడ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు ఉదయం తెల్లవారుజామునే పాఠశాల ప్రారంభిస్తున్నందున వ్యాయామం చేసేందుకు ఎక్కడ కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాయామం చేసే వారికి కోదాడ చెరువు కట్ట ఎంతో ఆహ్లాద భరితంగా ఉంటుందని ఉదయాన్నే సూర్యరష్మి తో పాటు చెరువు అందాలకు వాకింగ్, సైక్లింగ్ చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ రమాదేవి వీలైనంత తొందరగా మున్సిపల్ సిబ్బందితో పిచ్చి చెట్లు, కంపచెట్లను తొలగించి చెరువు కట్టను శుభ్రం చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు…….

Related posts

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 13న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.  ఎస్కేయం జిల్లా కన్వీనర్ మండారి డేవిడ్ కుమార్

TNR NEWS

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

TNR NEWS